ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.
- Good News
- January 19, 2024
- No Comment
- 862
ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*
తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు. *తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది.* దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది. సీఎం రేవంతన , మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్ వల్లిలో అదానీ కొనెక్స్ (AdaniConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. *అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.*
ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు.
ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు.
*గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది.* అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది
*జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.*
తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది.
డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. *ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.*
జై కాంగ్రెస్
జై రేవంతన్న సి యమ్
జై జి యమ్ ఆర్
దేవరకద్ర నియోజకవర్గం
యన్. ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ నాయకుడు, కొత్తకోట
దేవరకద్ర నియోజకవర్గం.