*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్ బీ కాలనీ, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, నానక్ రాంగూడ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి తాండ, హఫీజ్ పేట్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మాదాపూర్ జోన్ మరియు బాలానగర్ జోన్ లో కీపీహెచ్బీ కాలనీ లోని మలేషియన్ టౌన్ షిప్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, కుత్బుల్లాపూర్ జెడ్పిహెచ్ఎస్, నిజాంపేట్ లోని జెడ్పిహెచ్ఎస్, నానక్ రాంగూడ ఎంపిపిఎస్, గౌలిదొడ్డి ఎంపిపిఎస్, హఫీజ్ పేట్ లోని న్యూ ఆదిత్యా నగర్ లో ఉన్న హోలీ హై స్కూల్, గోపన్ పల్లి తాండ లోని ఎంఎంపిఎస్, జగద్గిరిగుట్ట లోని సీఎమ్ఆర్ మోడల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీపీ గారు సైబరాబాద్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లోని Public Safety Integrated Operation Centre (PSIOC) సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న QRT vehicles కు అమర్చిన GIS వ్యవస్థ నుంచి రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు. సీపీ గారి వెంట మాదాపూర్ డీసీపీ శ్రీ సందీప్, బాలానగర్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు, ఐపీఎస్., ఏసీపీ మాదాపూర్ శ్రీనివాస్, ఏసీపీ బాలానగర్ గంగారాం, బాచుపళ్లి ఇన్ స్పెక్టర్ సుమన్, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ పవన్, గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ జేమ్స్ బాబు, కీపీహెచ్ బి ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ ఇన్ స్పెక్టర్లు తదితరులు ఉన్నారు.
- All Posts
- November 30, 2023
- No Comment
- 837
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్ బీ కాలనీ, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, నానక్ రాంగూడ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి తాండ, హఫీజ్ పేట్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
మాదాపూర్ జోన్ మరియు బాలానగర్ జోన్ లో కీపీహెచ్బీ కాలనీ లోని మలేషియన్ టౌన్ షిప్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, కుత్బుల్లాపూర్ జెడ్పిహెచ్ఎస్, నిజాంపేట్ లోని జెడ్పిహెచ్ఎస్, నానక్ రాంగూడ ఎంపిపిఎస్, గౌలిదొడ్డి ఎంపిపిఎస్, హఫీజ్ పేట్ లోని న్యూ ఆదిత్యా నగర్ లో ఉన్న హోలీ హై స్కూల్, గోపన్ పల్లి తాండ లోని ఎంఎంపిఎస్, జగద్గిరిగుట్ట లోని సీఎమ్ఆర్ మోడల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
సీపీ గారు సైబరాబాద్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లోని Public Safety Integrated Operation Centre (PSIOC) సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న QRT vehicles కు అమర్చిన GIS వ్యవస్థ నుంచి రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు.
సీపీ గారి వెంట మాదాపూర్ డీసీపీ శ్రీ సందీప్, బాలానగర్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు, ఐపీఎస్., ఏసీపీ మాదాపూర్ శ్రీనివాస్, ఏసీపీ బాలానగర్ గంగారాం, బాచుపళ్లి ఇన్ స్పెక్టర్ సుమన్, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ పవన్, గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ జేమ్స్ బాబు, కీపీహెచ్ బి ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ ఇన్ స్పెక్టర్లు తదితరులు ఉన్నారు.