కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయ భేరి భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు హాజరయ్యారు.ఈ సభలో ఖర్గే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్. హన్మంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని తెలిపారు. ఖర్గేతో పాటు బహిరంగ సభకు హాజరైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని.. మీ నియోజకవర్గ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తానని.. ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు అందరికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లను అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో AICC ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే, AICC మెంబర్లు, సిపిఐ జాతీయ నాయకులు, TPCC మెంబర్లు, TPCC ప్రధాన కార్యదర్శులు సొంటిరెడ్డి పున్నారెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, జ్యోస్నా శివారెడ్డి, నియోజకవర్గ నాయకులు KM. ప్రతాప్ లతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు, కార్యకర్తలు, కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలు అధిక పాల్గొన్నారు.
- All Posts
- November 18, 2023
- No Comment
- 862