బాబు సాహిత్య సంగీతం విడదీయరానిది –డాక్టర్ బండారి జగదీష్ బాబు సాహిత్యానికి, సంగీతానికి విడదీయరాని బందం ఉందని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ బండారి జగదీష్ బాబు అన్నారు. గురువారం హనుమకొండలోని జయకృష్ణ హాస్పిటల్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సంఘం,ఏకశిల కరోకే క్లబ్ సంయుక్త నిర్వాణలో సాహిత్య సంగీత సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జగదీష్ బాబు మాట్లాడుతూ మత సామరస్యం,సంస్క్రతులకు ప్రతీకగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను కొనియాడారు. ప్రేమ అనే శీర్షిక పై కవి సమ్మేళనం నిర్వహించి కవులను,పాటల రూపకంలో పాటలు పాడించి గాయకులను తయారు చేస్తూ కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమన్నారు.హాజరైన కొంత మంది కవితలను వినిపించగా మరి కొంత మంది పాటలతో అలరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మహమ్మద్ సిరాజుద్దీన్,విప్పనపల్లి రవికుమార్,ప్రముఖ కవి రామా చంద్రమౌళి,సంగీత విధ్వాంసులు విద్యాసాగర్,సైబర్ క్రైం ఎసిపి కూజ విజయ్ కుమార్,ఖాజీపేట పురుషోత్తం,కార్యక్రమ సమన్వయ కర్త నిమ్మల శ్రీనివాస్, సామాజిక వేత్త సాగంటి మంజుల,డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.