న్యాయానికి సంకెళ్ల’’తో మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని 36రోజులుగా అక్రమ నిర్బంధంపై, టిడిపి చేపట్టిన ‘‘న్యాయానికి సంకెళ్లు’’ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్ రావు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో చేతికి సంకెళ్లతో నిరసన తెలిపారు. 14ఏళ్లు సీఎంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చంద్రబాబు అభివృద్ధి ముద్రలేని పల్లె, వార్డు లేదన్నారు. ఊరూరా, వార్డువార్డునా ఎక్కడికెళ్లినా ఆయన వేసిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలే దర్శనమివ్వడమే చంద్రబాబు 2తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు సేవలకు నిదర్శనం అన్నారు. జైల్లోపెట్టింది చంద్రబాబును కాదు, అభివృద్ధిని చెరపట్టారని, పేదల సంక్షేమాన్నే నిర్బంధించారని ఆవేదన చెందారు..మాజీ సీఎం ఆరోగ్యం పట్ల యావత్ తెలుగుజాతి అంతా ఆందోళన చెందుతోందని, చంద్రబాబు ప్రాణాలతో జగన్మోహన రెడ్డి చెలగాటం ఆడుతున్నారని, కేంద్రం కల్గజేసుకుని ఏపీ సిఎం కక్ష రాజకీయాలకు తెరదించాలని కోరారు. చంద్రబాబు పట్ల జగన్ కక్షసాధింపువైఖరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కంభంపాటి రామమోహన రావు, మాజీ ఎంపి(రాజ్యసభ) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (తెలంగాణ వ్యవహారాల టిడిపి ఇన్ ఛార్జి)
- Andhra Pradesh
- October 20, 2023
- No Comment
- 629
న్యాయానికి సంకెళ్ల’’తో మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్
మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని 36రోజులుగా అక్రమ నిర్బంధంపై, టిడిపి చేపట్టిన ‘‘న్యాయానికి సంకెళ్లు’’ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్ రావు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో చేతికి సంకెళ్లతో నిరసన తెలిపారు.
14ఏళ్లు సీఎంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చంద్రబాబు అభివృద్ధి ముద్రలేని పల్లె, వార్డు లేదన్నారు. ఊరూరా, వార్డువార్డునా ఎక్కడికెళ్లినా ఆయన వేసిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలే దర్శనమివ్వడమే చంద్రబాబు 2తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు సేవలకు నిదర్శనం అన్నారు.
జైల్లోపెట్టింది చంద్రబాబును కాదు, అభివృద్ధిని చెరపట్టారని, పేదల సంక్షేమాన్నే నిర్బంధించారని ఆవేదన చెందారు..మాజీ సీఎం ఆరోగ్యం పట్ల యావత్ తెలుగుజాతి అంతా ఆందోళన చెందుతోందని, చంద్రబాబు ప్రాణాలతో జగన్మోహన రెడ్డి చెలగాటం ఆడుతున్నారని, కేంద్రం కల్గజేసుకుని ఏపీ సిఎం కక్ష రాజకీయాలకు తెరదించాలని కోరారు. చంద్రబాబు పట్ల జగన్ కక్షసాధింపువైఖరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
కంభంపాటి రామమోహన రావు, మాజీ ఎంపి(రాజ్యసభ)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (తెలంగాణ వ్యవహారాల టిడిపి ఇన్ ఛార్జి)