పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్ గ
- All Posts
- November 24, 2023
- No Comment
- 951
తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం
పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే
ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ
దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు.
76 ఏండ్ల నుండి దేశంలో అగ్రకులాల ఆధిపత్యమే నడుస్తుంది
ఉచితాలు అలవాటు చేసి బీసీల రాజ్యాధికారాన్ని గుంజుకున్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్ధానాలలో పోటీ చేస్తాం
అధికార పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మకండి బీసీ బిడ్డలారా
బి సీ బిడ్డను ఆశీర్వదించి గెలిపించండి
పాలకుర్తి రూపురేఖలు మారుస్తా
ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ పీపుల్స్ పార్టీ అధ్యక్షులు, పాలకుర్తి అభ్యర్థి చీకటి భూపాల్ గౌడ్
పాలకుర్తి,
తెలంగాణలో బీసీల రాజ్యాధికారం తెస్తామని, పాలకుర్తిలో గెలిచేది సునామీ పార్టీ నే అని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ అధ్యక్షులు, పాలకుర్తి అసెంబ్లీ అభ్యర్థి చీకటి భూపాల్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నేళ్లలో పాలకుర్తిలో జరిగింది అభివృద్ధి కాదని అగ్రకులాల దోపిడీనే అని అన్నారు. దేశాన్ని మోడీ అమ్ముకుంటున్నాడని అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ దేశాన్ని మరో శ్రీలంక పాకిస్తాన్ లాగా మార్చుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన దొరల పాలనను తలపిస్తుందని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పరిపాలిస్తున్నాడని అన్నారు.
తెలంగాణలో కెసిఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని అభివృద్ధి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే జరిగిందని దుయ్యబట్టారు. నీళ్లు ఇచ్చి అభివృద్ధి అంటూ, కరెంటు ఇచ్చి అభివృద్ధి అంటూ కరెంటు చార్జీలను పెంచుతున్నారని అన్నారు.
తెలంగాణలో అగ్రకులాలు బీసీలను ఎన్నేళ్లు మోసం చేసి పరిపాలిస్తారని అణగారిన కులాలను అనగదొక్కుతున్నారని 13 శాతం ఉన్న అగ్రకులాలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. 80 శాతం ఉన్న మిగతా కులాల వారికి రాజకీయ రంగంలో ఉద్యోగ రంగాలలో అవకాశాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. 76 సంవత్సరాలుగా దేశాన్ని రాష్ట్రాన్ని అగ్రకులాల వారే ఏలుతున్నారని బీసీలను మోసం చేసి అధికారం చేపడుతున్నారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదని, పథకాలు కాదని బీసీల రాజ్యాధికారమేనని బీసీల రాజ్యాధికారం కోసం సునామీ పార్టీ అహర్నిశలు పోరాడుతుందని అన్నారు. ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ అగ్రకులాల ఓట్లు అడగదని 52 శాతం ఉన్న మా బీసీల ఓట్ల అడుగుతామని, అధికారం సాధిస్తామని అన్నారు. 119 నియోజకవర్గాలలో ఎలక్షన్ కమిషన్ కామన్ గుర్తుగా పార్టీకి ఉంగరం గుర్తుని కేటాయించిందని ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆశీర్వదించి గెలిపించాలని పాలకుర్తి రూపురేఖలను మారుస్తానని పాలకుర్తిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తానని అన్నారు. కొడకండ్ల రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని హైవే లాంటి రోడ్డు నిర్మాణం చేపడతారని అన్నారు. పాలకుర్తి ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్నాయని గతంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి
పోటీ చేశానని పాలకుర్తి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం వచ్చిన సమయంలో అప్పుడు ఇక్కడి అగ్రకుల సామాజిక వర్గం టికెట్టు రాకుండా చేసిందని అన్నారు. ఇప్పుడు పోటీలో ఉన్నానని బీసీ లు అంతా ఏకమై గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొయ్యాడి అశోక్ గౌడ్, పంజాల యాకన్న గౌడ్,ఎల్లగౌడ్,బండారి జంపన్న గౌడ్, లింగాల నర్సయ్య గౌడ్, నక్క శ్రీనివాస్, బైరు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.